మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

By :  Vamshi
Update: 2024-09-01 06:16 GMT

తెలంగాణ వ్యాప్తంగా మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఉన్నాయి. ఇక భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

Tags:    

Similar News