హైదరాబాద్‌లో భారీ వర్షం..స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

By :  Vamshi
Update: 2024-07-05 15:05 GMT

హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, కొండాపూర్, నిజాంపేట్, బేగంపేట, జుబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మరో గంట పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లలపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షసూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చారించారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది

Tags:    

Similar News