హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

By :  Vamshi
Update: 2024-07-11 14:16 GMT

హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్,ఫిలింనగర్‌, కొండాపూర్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ,సోమాజిగూడ, రసూల్‌పుర, అమీర్‌పేటలో భారీ వర్షం పడింది. దీంతో ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వేళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది.

Tags:    

Similar News