కోల్‌కత్త హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ఆవేదన

కోల్‌కత్త జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-08-28 11:12 GMT

కోల్‌కత్త జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను త్రీవంగా కలిచివేసిందన్నారు. అది భయానకమని, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దారుణాల్లో ఒకటని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి దారుణాల‌కు గురికావ‌డాన్నిసమాజం సహించదన్నారు. అందుకే యావత్ భారత దేశం భగ్గుమంటోందని తానూ అందులో ఒకర్నని రాష్ట్రపతి అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ట్రైనీ డాక్ట‌ర్ హత్యాచార ఘటనపై రోజురోజుకీ ఆందోళనలు తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉదాంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన జరిగి 20 రోజులు కావస్తున్న దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గర్షణ నెలకొంటుంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు బిజెపి 12 గంటల బంద్ కి పిలుపునిచ్చింది. 

Tags:    

Similar News