భారత్‌కు వస్తానని హసీనా వేడుకొంది : కేంద్ర మంత్రి జైశంక‌ర్‌

ఫ్ల‌యిట్ క్లియ‌రెన్స్ కోసం బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని హ‌సీనా స‌ర్కారు నుంచి అభ్య‌ర్థ‌న వ‌చ్చిన‌ట్లు కేంద్ర మంత్రి విదేశాంగ జైశంక‌ర్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు.

By :  Vamshi
Update: 2024-08-06 10:36 GMT

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి జైశంక‌ర్ రాజ్య‌స‌భ‌లో కీలక ప్ర‌క‌ట‌న చేశారు. అక్కడ రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

విమాన క్లియ‌రెన్స్ కోసం మాజీ ప్రధాని హ‌సీనా ప్రభుత్వం నుంచి అభ్య‌ర్థ‌న వ‌చ్చిన‌ట్లు కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. బంగ్లాలో శాంతి, భ‌ద్ర‌త‌లు నెల‌కొనే వ‌ర‌కు ఆందోళ‌న ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. గ‌డిచిన 24 గంట‌ల నుంచి ఢాకా అధికారుల‌తో ట‌చ్‌లో ఉన్నామ‌ని, సున్నిత‌మైన అంశాల గురించి చ‌ర్చించామ‌న్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న భార‌తీయుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Tags:    

Similar News