ఒకే విడతలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ సీఈసీ రాజీవ్‌కుమార్ విడుదల చేశారు

By :  Vamshi
Update: 2024-08-16 10:57 GMT

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్‌ను సీఈసీ రాజీవ్‌కుమార్ రిలీజ్ చేశారు. హర్యానాలో 90 శాసన సభ నియోజకవర్గాలకు ఆక్టోబర్ 1న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆక్టోబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 12వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 13న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

Tags:    

Similar News