ఫలించిన హరీష్ కృషి.. ఆనందంలో అన్నదాతలు

మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖతో ప్రభుత్వం దిగి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు తరలి వస్తున్నాయి.

By :  Raju
Update: 2024-08-06 08:37 GMT

వర్షాభావ పరిస్థితులతో అడుగంటిన జలాశయాల ఫలితంగా వానకాలంలో సిద్దిపేట జిల్లా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వానికి లేఖ రాశారు. హరీశ్‌ లేఖతో ప్రభుత్వం దిగి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు తరలి వస్తున్నాయి. గోదావరి జలాలు రంగనాయక సాగర్‌లోకి పరుగులు పెట్టాయి. హరీశ్‌ కృషి ఫలించడం పట్ల జిల్లాలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



 సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని హరీశ్‌ రావు శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం సాగునీటి పారుదల ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా స్పందించారు. మీరు రాసిన లేఖ అందిందని, సోమవారం నుంచి మిడ్‌ మానేర్‌ ద్వారా సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తామమని బదులిచ్చారు. ఈ మేరకు ఇవాళ గోదావరి జిలాలు రంగనాయక సాగర్‌లోకి వచ్చాయి. దీంతో రైతులు హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News