ఆపద్బాంధవుడు అన్నయ్యకు జన్మదిన శుభాంక్షలు : పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాంక్షలు తెలిపారు.

By :  Vamshi
Update: 2024-08-22 03:53 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాంక్షలు తెలిపారు.‘‘నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఎందరికో ఆయన సహాయం చేశారని కొనియాడారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు ఆ గుణమే చిరుని సుగుణ సంపన్నుడిగా చేసిందన్నారు.

 

 గత అసెంబ్లీ ఎన్నికలు సమయంలో జనసేన పార్టీకి రూ. 5 కోట్లు విరాళమిచ్చి విజయంలో సహకరించిన ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవ దేవుడిని మనసారా కోరుకుంటున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Tags:    

Similar News