ఆందోళన చేసిన గురుకుల మహిళ టీచర్ సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ

Update: 2024-08-23 17:34 GMT

బదిలీలు, పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని సంక్షేమ భవన్ ఆవరణలోని ఎస్సీ గురుకుల విద్యాలయ సొసైటీ ఆవరణ చేసిన వారిలో ఒకరిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న 142 మంది గురుకుల మహిళా టీచర్లు తమకు అన్యాయం జరిగిందని.. దానిని సరి చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సోషల్) కె. విజయ నిర్మల క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించారని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారని, డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బందిపై అరిచారని, ఉన్నతాధికారులను దూషించారని, సొసైటీ ఆఫీస్ ఆవరణలో న్యూసెన్స్ చేశారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీతో పాటు ఆ రోజు వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన వీడియో ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టామని గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నారు. 142 మంది టీచర్లు ఆందోళన చేయడానికి తన ఆఫీస్ లోని సిబ్బంది కారణమని ఇప్పటికే ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినా, ఆందోళన చేసిన వారికి అన్యాయం జరిగిందని గురుకుల ఉన్నతాధికారులు ఒప్పుకుంటున్నా తప్పు చేసిన సిబ్బందిని విడిచిపెట్టి టీచర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.

గురుకుల టీచర్​ సస్పెన్షన్​ ఆర్డర్​ కోసం ఈ  కింది లింక్​ క్లిక్​ చేయండి



Tags:    

Similar News