నార్సింగిలో గన్ మిస్ ఫైర్.. మహిళకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో మరోసారి బుల్లెట్ కలకలం రేపింది.. నార్సింగిలోని గంధంగూడలో ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుఫాకీ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది.

By :  Vamshi
Update: 2024-07-30 09:23 GMT

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. నార్సింగిలోని గంధంగూడలో ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గన్ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. ఈ క్రమంలో బుల్లెట్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు రికార్డుల్లో రాసుకున్నారు. అయితే… ఈ నెలలోనే ఇది రెండవ సారి ఇలాంటి ఘటనే జరిగింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News