రైతుల కోసం రంగంలోకి గులాబీ బాస్

అన్నదాత కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నడుము బిగిస్తున్నారు. రైతు రుణ మాఫీ కాక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా రైతు భరోసా యాత్ర చేపట్టన్నారు.

By :  Vamshi
Update: 2024-08-29 13:46 GMT

అన్నదాత కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నడుము బిగిస్తున్నారు. రైతు రుణ మాఫీ కాక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా రైతు భరోసా యాత్ర చేపట్టన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ ప్రజల్లోకి రాబోతున్నారు. ఈ యాత్రపై రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహం పెరిగింది.

దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ రైతుల కోసం మరోసారి పోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు. కాగా, ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News