జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు

జులైలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.

By :  Vamshi
Update: 2024-08-01 14:26 GMT

దేశంలో జీఎస్టీ వసూళ్లు జులైలో మరోసారి గణనీయంగా పెరిగాయి. ఆగస్ట్ 1న విడుదల చేసిన లెక్కల ప్రకారం రూ.1.82 లక్షల కోట్లు వసూళ్లు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో 1.74 కోట్లు వసూళ్లు సాధించింది. గతంతో పోలిస్తే రూ.10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

కరోనా తర్వాత మొదటిసారి వసూళ్లు 10 శాతం వరకు పడిపోయాయి. కానీ ఈ జులైలో రెండంకెల వృద్ధి సాధించింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నెల కంటే జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 కోట్లు నమోదు కావడం గమనార్హం.

Tags:    

Similar News