ఆర్టీసీని ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

ఆర్టీసీ ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నదన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించవద్దని బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం మనవి చేశారు.

By :  Raju
Update: 2024-07-24 05:56 GMT

ఆర్టీసీ అంశంపై చర్చ సందర్భంగా మంత్రి నుంచి సరైన సమాధానం ఇవ్వకపోవడాన్ని హరీశ్‌ తప్పుపట్టారు. ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. హరీశ్‌ రావు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారని, పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. సభాపతిపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

ఆర్టీసీ కార్మికుల తరఫున మాట్లాడేందుకు సీపీఐకి అవకాశం ఇచ్చారని, సీపీఐకి అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు. ప్రశ్న అడిగే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎక్కడా లేదన్నారు. ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నది సభాపతి విచక్షణ అన్నారు. ఆర్టీసీ ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నదన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించవద్దని బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం మనవి చేశారు.

Tags:    

Similar News