గోవర్థన గిరిదారీ.. వరదల నుంచి రక్షించు

చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

Update: 2024-09-07 09:02 GMT

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదల నుంచి గోవర్ధన గిరిదారి చిల్కూరు బాలాజీ రక్షించాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు, అదనంగా మరో రెండు ప్రదక్షిణలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు ఎక్కువగా కురిశాయని, ఇక వానలు ఆగాలని పూజలు చేశారు. ఆలయ ప్రధాన పూజారి సీఎస్‌ రంజరాజన్‌ ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు. ఈ నెలలో మరికొన్ని తుపాన్లు సంభవించనుండటంతో వారి ప్రభావంతో జల ప్రళయం కలగొద్దని ఆశిస్తూ సుదర్శన అష్టకం పటించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో అదనపు ప్రదక్షిణలు చేశారు. సకల జీవులు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. వరదలు, విధ్వంసం, అనారోగ్యం, గాయాలు, విపత్తులు, ఆకస్మిక మరణాల నుంచి రక్షణ, ప్రతికూల పరిస్థితుల్లో గోవింద నామస్మరణతో ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయని అర్చకులు తెలిపారు. వరద బాధితులకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని అర్చకులు సూచించారు.

Tags:    

Similar News