ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గురువారం ఆయనతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

By :  Raju
Update: 2024-06-19 05:06 GMT

టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. పయ్యావుల ప్రతిపాదననకు గోరంట్ల అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకర్‌గా గురువారం ఆయనతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read - ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణం

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు అందరి కంటే సీనియర్‌ ఎమ్మెల్యే. ఆయన తొమ్మిదిసార్లు గెలువగా ఆయన తర్వాత అత్యధికంగా గోరంట్ల ఏడుసార్లు గెలిచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

స్పీకర్‌ పదవికి అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ పదవికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోకం మాధవి, పంతం నానాజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీ మరో సీనియర్‌ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకుమార్‌ను చీఫ్‌ విప్‌గా నియమించనున్నారని సమాచారం.

Tags:    

Similar News