హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన: మంత్రి పొన్నం

కూల్చివేతలపై ప్రభుత్వం ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్న మంత్రి

By :  Raju
Update: 2024-08-26 08:51 GMT

హైడ్రా పేరుతో కూల్చివేతలపై భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. మరికొంతమంది దీన్ని హైడ్రామాగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతపై మాట్లాడుతూ... చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.ఎంత పెద్దవాళ్లు ఉన్నా.. చెరువు ఆక్రమణకు గురైందంటే అక్కడ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి వచ్చే వరం ఇది. మీ ప్రాంతంలో ఆక్రమణకు గురైతే ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని అందించాలన్నారు.

వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెరువులపై ప్రభుత్వ లెక్కలు, రికార్డుల మేరకు కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులను పరిరక్షించుకోవాలన్నారు. చెరువుల రక్షణపై ప్రభుత్వం దృష్టికి స్థానికులే తేవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్న మంత్రి ప్రభుత్వ పనిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. 

Tags:    

Similar News