సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.30లక్షల ప్రమాద బీమా

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

By :  Vamshi
Update: 2024-07-23 15:47 GMT

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సింగరేణి గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ సాలరీ అకౌంట్‌ ఉన్న ప్రతి కాంటాక్టర్‌ ఉద్యోగికి బీమా అమలవుతుందని చైర్మన్‌, ఎండీ బలరామ్‌ పెర్కొన్నారు. సింగరేణి భవన్‌లో ఆయన ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేసేందుకు ప్రతీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సాలరీ అకౌంట్‌ ఉండాలన్నారు. ఈ విషయంలో ఏరియా జీఎంలు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇప్పటికే సింగరేణి ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ల ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం, ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించామన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం హెచ్‌డీఎఫ్‌సీతోనూ ఒప్పందం చేసుకుని రూ.30లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రూ.50లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా ఆరోగ్య సేవలు అందించే విషయంపై ఈఎస్ఐ ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు

Tags:    

Similar News