మాంద్యం భయాలతో 'మండే' పోయింది

స్టాక్‌మార్కెట్‌ మదుపర్లకు సోమవారం ఊహించని షాక్‌ తగిలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లొచ్చన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి.

By :  Raju
Update: 2024-08-06 02:45 GMT

స్టాక్‌మార్కెట్‌ మదుపర్లకు సోమవారం ఊహించని షాక్‌ తగిలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లొచ్చన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, జపాన్‌లో వడ్డీ రేట్ల పెంపు దీనికి తోడయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడటంతో సూచీలు పతనమయ్యాయి.

బ్యాకింగ్‌, లోహ, చమురు-గ్యాస్‌ షేర్లు అమ్మకాలతో విలవిలలాడాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఒకేరోజు -2223 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఉదయం 2394 పాయింట్ల భారీ నష్టంతో 78,588.19 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తర్వాత సూచీ కోలుకునే ప్రయత్నం చేసి 79,780.61 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. దీంతో ఒక దశలో సెన్సెక్స్‌ 2,686.09 పాయింట్లు కుప్పకూలి 78,295.86 పాయింట్లకు పడిపోయింది. చివరికి 2222.55 పాయింట్ల (2.74 శాతం) నష్టంతో 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్లు క్షీణించి 24056 వద్ద ముగిసింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 84.09 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 1.93 శాతం నష్టంతో 75.33 వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News