స్వల్పంగా పెరిగిన పసిడి ధర

బంగారం ధర కొంచెం పెరిగింది. శ్రావణ మాసం దగ్గర పడుతుండటంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.

By :  Raju
Update: 2024-07-31 02:39 GMT

బంగారం ధర కొంచెం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరపై కనిపించింది. శ్రావణ మాసం దగ్గర పడుతుండటంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. శ్రావణంలో పెండ్లిల్లు, నోములు, పూజల వంటివి చేసుకుంటారు. బంగారం కొనుగోలు చేయడానికి వినియోగదారలు ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్‌లో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకం తగ్గించిన తర్వాత కొనుగోళ్లు పెరిగిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,550గా ఉన్నది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,320గా ఉన్నది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా పలికింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,410గా ఉన్నది. క్వాలిటీ బంగారం ధర రూ. 69,170గా ఉన్నది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,410గా ఉన్నది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,170గా ఉన్నది. హైదరాబాద్‌ కేరళ, విజయవాడడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 88,900 గా ఉండగా.. ఢిల్లీ, ముంబై, పూణెలలోరూ. 84,400కి చేరింది.

150 టన్నుల బంగారం

బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో దేశీయంగా జూన్‌ త్రైమాసికంలో 149.7 టన్నులకు గిరాకీ పరిమితమైంది. 2023 ఇదే కాల గిరికీ 158.1 టన్నులతో పోలిస్తే ఇది 5 శాతం తక్కువని వరల్డ్‌ గోల్డ్‌ కమిటీ తాజా నివేదికలో వెల్లడించింది. విలువ పరంగా చూస్తే మాత్రం గిరికీ రూ. 82,530 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ. 93,850 కోట్లకు చేరింది.

Tags:    

Similar News