పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి

కేంద్ర బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. పసడి ధర పెరగగా, వెండి ధర తగ్గింది.

By :  Raju
Update: 2024-07-17 02:51 GMT

ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభకానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 23న పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో 2024 కేంద్ర బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. జులై 17 ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 67,860కి చేరుకున్నది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 74,030కు చేరుకున్నది.

మరోవైపు వెండి ధర కిలోకు రూ. 200 తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 94,900కు చేరుకున్నది. వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 74,180, రూ. 68, 010

హైదరాబాద్‌లో రూ. రూ. 74,030, రూ. 67, 860

విజయవాడలో రూ. 74,030, రూ. 67, 860

బెంగళూరులో రూ. 74,030, రూ. 67, 860

ముంబాయిలో రూ. 74,030, రూ. 67, 860

కోల్‌కతాలో రూ. 74,030, రూ. 67, 860

చెన్నైలో రూ. 74,520, రూ. 68,8310

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 94,900

హైదరాబాద్‌లో రూ. 99,400

విజయవాడలో రూ. 99,,400

బెంగళూరులో రూ. 94,150

చెన్నైలో రూ. 99,400

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Tags:    

Similar News