మా జాబ్‌లు మాకు ఇవ్వండి..గురుకుల అభ్య‌ర్థుల భిక్షాట‌న‌

గురుకుల అభ్యర్థుల నిరసనకు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్

By :  Vamshi
Update: 2024-06-26 08:20 GMT

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్ధులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేసే వరుకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ రోడ్డు మీదే బైఠాయించారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. గురుకుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ సర్కార్ శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండ‌ర్ జారీ చేస్తామ‌ని, మెగా డీఎస్సీతో పాటు ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా ఒక్క నోటిఫికేష‌న్ కూడా ఇవ్వ‌లేదు. గ‌త ప్ర‌భుత్వంలో జారీ చేసిన నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన ఉద్యోగాల భ‌ర్తీల్లోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది.

దీంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. మా జాబ్‌లు మాకు ఇప్పించండి అంటూ పెద్దమ్మ గుడి ముందు గురుకుల అభ్యర్థులు భిక్షాట‌న చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవ‌డంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్‌లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News