గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేము : పవన్ కళ్యాణ్

ప్రజా గాయకుడు గద్దర్, పాటనే తూటాలుగా మలచి - తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

By :  Vamshi
Update: 2024-08-06 12:34 GMT

పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ తన పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రధమ వర్ధంతి సందర్బంగా మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నాని పవన్ పేర్కొన్నారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారని తెలిపారు.

పాటనే తూటాలుగా మలచి - తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. తుది శ్వాస విడిచే వరకూ ప్రజా హక్కుల గురించే ఆలోచించారు. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్‌ని తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకూ ఆయనతో ఉన్న అనుబంధం కొనసాగిందని యాదీ చేసుకున్నారు. గద్దర్ అనే పేరు తలుచుకోగానే కాలికి గజ్జె కట్టి ఆడిపాడిన పాట గుర్తుకొస్తుంది. అలాగే - ప్రజల గురించిన పాట బతికినంత కాలం గద్దర్ పేరు చిరంజీవిగానే ఉంటుందని పవన్ తెలిపారు.

Tags:    

Similar News