ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఫాక్స్‌కాన్ కంపెనీ పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది : కేటీఆర్

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం, యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థతో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2023లోఈ అవగాహన ఒప్పందం కుదిరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-14 16:14 GMT

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం, యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థతో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2023లోఈ అవగాహన ఒప్పందం కుదిరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఫాక్స్‌కాన్ కంపేనీ ఇప్పుడు ఆంధ్రా, కర్ణాటకలకు విస్తరిస్తున్నాయి. కానీ తెలంగాణ కోసం వారి మెగా పెట్టుబడి ప్రణాళికలు ఏమయ్యాయి కేటీఆర్ ప్రశ్నించారు. కొంగరకలాన్‌లో రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. సంస్థ ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఇవాళ తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్(ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు భారత్‌లో పర్యటించారు. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై.. కీలక విషయాలను చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

Tags:    

Similar News