మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను జులై 18కి వాయిదా వేసింది

By :  Vamshi
Update: 2024-06-25 08:27 GMT

తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011 రైల్ రోకో కేసు విచారణపై కోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 18కి వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమంలో రైలురోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని ఇటీవల పోలీసులు నివేదికలో పొందుపర్చారు. తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, అయితెే తాను ఎలాంటి పిలుపు ఇవ్వలేదని ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో సోమవారం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే విచారణపై హైకోర్టు స్టే విధించింది.

ఈ క్రమంలోనే హైకోర్టు ఇవాళ విచారణను వాయిదా వేసింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. విచారణ వచ్చే నెల 23 కి వాయిదా వేసినట్లు హైకోర్టు నాలుగో బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి వెల్లడించారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో మాజీ సీఎం రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ నివేదికలో వెల్లడించారు. రైలు రోకో వల్ల ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిందని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. 

Tags:    

Similar News