సింగరేణి కారుణ్య నియామ‌క ఉద్యోగార్థుల‌కు తీపి కబురు

కారుణ్య నియామకాల్లో వయోపరిమితి పెంపు

Byline :  Vamshi
Update: 2024-06-11 10:47 GMT

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల్లో వారసులు వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు సీఎండీ ప్రకటించారు 2018 మార్చి 9 నంచి దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సింగరేణి కార్మికుడు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. కార్మికుల సంక్షేమంలో భాగంగా వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కార్మికులను, వారి కుటుంబాలకు రూ.కోటి బీమా సదుపాయాన్ని సంస్థ అందిస్తోంది. దీంతో పాటు సింగరేణి కార్మికుల పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో చదువులు అందించేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Tags:    

Similar News