ప్రాణహితలో ప్రవాహం మొదలు.. కొనసాగుతున్న మేడిగడ్డ రిపేర్లు

By :  Raju
Update: 2024-06-22 09:03 GMT

ప్రాణహిత నదిలో వరద ప్రవాహం మొదలైంది. ఎగువ నుంచి 1,270 క్యూసెక్కుల వరద వస్తోంది. రానున్న రోజుల్లో వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఇరిగేషన్‌ ఇంజనీర్లు, వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులు మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో రిపేర్లు, ఇతర పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే ఏడో బ్లాక్‌ ఫౌండేషన్‌ కింద ఏర్పడిన భారీ గుంతను ఇసుక, సిమెంట్‌, కెమికల్‌ మిశ్రమంతో గ్రౌంటింగ్‌ చేస్తున్నారు. ఏడో బ్లాక్‌లో మొయించిన గేట్ల తొలగింపు ప్రక్రియలోనూ వేగం పెంచారు. నిరుడు అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 20వ నంబర్‌ పిల్లర్‌ భారీ శబ్దంతో కుంగింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేశారు. వానాకాలంలోనే మేడిగడ్డకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయాల్సి ఉన్నా, ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తాత్కాలిక పనులు మాత్రమే చేస్తున్నారు.

ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే రిపేర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడో బ్లాక్‌ ఫౌండేషన్‌ దెబ్బతినకుండా షీట్‌ ఫైల్స్‌ ఏర్పాటు ప్రక్రియలోనూ వేగం పెంచారు. ఆ తర్వాత ఏడో బ్లాక్‌ లోని వరద ప్రవాహం రాకుండా నిర్మించిన అప్రోచ్‌ రోడ్‌ సహా ఇతర తాత్కాలిక పనులు తొలగించనున్నారు.

Tags:    

Similar News