వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా

వైసీపీకీ మరో భారీ షాక్ తగిలింది. కమెడియన్ అలీ పార్టీకి రాజీనామా చేశారు.

By :  Vamshi
Update: 2024-06-28 15:11 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు అలీ ప్రకటించారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఇకపై సామాన్య పౌరుడిగానే తాను ఓటు హక్కు వినియోగించుకుంటాననన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందింది. దీంతో ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలీ పస్ట్ టీడీపీలో పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.

వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ జెండా కప్పుకున్నారు. ఎలక్రానిక్ మీడియా సలహాదారుడిగా జగన్ అవకాశం కల్పించారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ అధినేత జగన్ సీటు ఇవ్వలేదు. సినీ నటుడు ఆలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా నటుడిగా, కమెడియన్‌గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆలీ సుమారు 1000 కిపైగా మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఆయనకు ఇటీవలే గౌరవ డాక్టరేట్ లభించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News