వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం శుభపరిణామం: కేటీఆర్‌

ఎస్సీ వర్గీకరణపై మిగతా రాజకీయపార్టీలు ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్‌ విమర్శించారు. కానీ కేసీఆర్‌ వర్గీకరణ అంశాన్ని సామాజిక కోణంలో చూశారని కేటీఆర్‌ తెలిపారు.

By :  Raju
Update: 2024-08-01 08:08 GMT

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. వర్గీకరణకు మద్దతుగా కేసీఆర్‌ ప్రధానికి లేఖ ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణపై మిగతా రాజకీయపార్టీలు ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్‌ విమర్శించారు. కానీ కేసీఆర్‌ వర్గీకరణ అంశాన్ని సామాజిక కోణంలో చూశారు. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం శుభపరిణామం అని కేటీఆర్‌ అన్నారు. సుప్రీం తీర్పు ఆధారంగా వర్గీకరణ ప్రక్రియను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించాలని, దీనికి బీఆర్‌ఎస్‌ తరఫున ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. 

Tags:    

Similar News