త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ : భట్టి

సమాజ అభివృద్ధిలో విద్య, గురువుల పాత్ర ఎంతో కీలకం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

By :  Vamshi
Update: 2024-09-05 12:52 GMT

తెలంగాణలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్ధలకు ఉచిత కరెంట్ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రధానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగనే 11 062 టీచర్ల పోస్టులకు డీఎస్సీ నిర్వహించమన్నారు. మరో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని భట్టి తెలిపారు. త్వరలో మరో 6వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీ కి రూ.100 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులేని అన్నారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గురువుల సలహా, సూచనలు కచ్చితంగా తీసుకుంటామని భట్టి స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. 63 ఐటీఐ సెంటర్లను ఏఐ సెంటర్లుగా మార్చబోతున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదట టీచర్ల గురించే ఆలోచించాం. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. అమ్మా ఆదర్శ పాఠశాలలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Tags:    

Similar News