డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల..షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ

డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది.

By :  Vamshi
Update: 2024-07-11 15:20 GMT

ఈనెల 18నుంచి ఆగస్టు 5వరుకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది.

మొత్తం 11,062 ఉద్యోగాల్లో.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి.https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News