డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల

త్వరలోనే ఫలితాలు రిలీజ్‌ చేయనున్న విద్యాశాఖ

Update: 2024-09-06 13:35 GMT

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్‌ కీని విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీజీపీఎస్సీ వెబ్‌ సైట్‌ లో ఫైనల్‌ కీ అందుబాటులో ఉంచారు. డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీని ఆగస్టు 13న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటికి అనుగుణంగా ఫైనల్‌ కీ రిలీజ్‌ చేశారు. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజీ పండిట్స్‌, ఎస్‌జీటీ, పీఈటీ పోస్టుల కీ అందుబాటులో ఉందని, అభ్యర్థులు ఫైనల్‌ కీని పరిశీలించి తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చని అధికారులు తెలపారు. 11,062 టీచర్‌ పోస్టుల కోసం నిర్వహించిన కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు. త్వరలోనే తుది ఫలితాలు వెల్లడించి అక్టోబర్‌లో కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు చెప్తున్నారు. 

Tags:    

Similar News