రుణమాఫీ నిధులు అప్పులకు జమ చేయవద్దు: భట్టి

ప్రభుత్వం విడుదల చేసే నిధులు రుణమాఫీకే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అప్పులకు జమ చేయవద్దని డిప్యూటీ సీఎం భట్టి బ్యాంకర్లకు సూచించారు.

By :  Raju
Update: 2024-07-18 07:35 GMT

రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని, మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీపై ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం బ్యాంకింగ్‌ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమని, రైతుల వలె బ్యాంకర్లూ పండుగ చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తెస్తాం. రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో అశ్రద్ధ చూపెట్టవదన్నారు.

ఈ సందర్భంగా బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులు రుణమాఫీకే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అప్పులకు జమ చేయవద్దన్నారు. రుణమాఫీకి అవసరమయ్యే రూ. 31 వేల కోట్లను ఆగస్టు చివరి నాటికి విడుదల చేస్తామని తెలిపారు. ఈ రోజు లక్ష వరకు ఉన్న రుణాల మాఫీ కోసం 11 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో వేయడానికి రూ. 6 వేల కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెలలోనే రెండో దఫా రూ. లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీ కోసం నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బ్యాంక్లరకు వెల్లడించారు. రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి రికవరీ చేసుకోవాలని భట్టి సూచించారు. ఏ రైతు రుణం బకాయి ఉండకుండా బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News