లేడీస్ హాస్టల్‌లో న్యూడ్ వీడియోలు తీస్తారా ? : షర్మిల

ఏపీలో గుడ్లవల్లేరు కాలేజీ లేడీస్ హాస్టల్ వాష్‌రూములో హిడెన్ కెమెరాలు బయటపడిన వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-08-30 10:13 GMT

ఏపీలో గుడ్లవల్లేరు కాలేజీ లేడీస్ హాస్టల్ వాష్‌రూములో హిడెన్ కెమెరాలు బయటపడిన వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాననీయ ఘటనకు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. చదువు, సంస్కారం బోధించవలసిన కాలేజీలో పిల్లలకు ఏం నేర్పుతున్నాయని ఆమె ప్రశ్నించారు.

ఉన్నత విద్యా కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఇదే నిరదర్శనం అని షర్మిల అన్నారు. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇదే సజీవ సాక్ష్యమని అన్నారు. కళాశాల మేన్‌జ్‌మెంట్ నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్పణమని అన్నారు. డబ్బులకు కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని షర్మిల అన్నారు

Tags:    

Similar News