పవన్‌తో ఆద్య..రేణూ దేశాయ్‌ రియాక్షన్ ఎంటో తెలుసా?

పవన్‌తో ఆద్యసెల్పీపై రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు

By :  Vamshi
Update: 2024-08-15 13:52 GMT

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి సెల్పీ తీసుకున్నారు. ఈ ఫోటోపై పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు.‘నా కూతురు ఆద్య నాన్నతో పాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా అని అడిగింది.

 

 ఫాదర్‌తో టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో చూడాలని తను అనుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయణ్ను ప్రశంసించింది.’ అని రేణూ దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తండ్రీ కూతుళ్ల సెల్ఫీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News