డయల్ 100 /112 పనితీరుపై డీజీపీ సమీక్ష

డీజీపీ జితేందర్ డయల్ 100/112 పనితీరుపై పోలీస్ కమిషనర్‌లతో, ఎస్పీలతో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లతో శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-07-26 15:14 GMT

తెలంగాణ డీజీపీ జితేందర్ డయల్ 100/112 పనితీరుపై పోలీస్ కమిషనర్‌లతో, ఎస్పీలతో, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లతో శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతు..శాంతి భద్రతలు కాపాడటంలో త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100 డయల్ 112 కీలక పాత్రను పోషిస్తున్నాయని డీజీపీ తెలిపారు. డయల్ 100 /112హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు.

పోలీసు సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో, నైపుణ్యం , స్పందనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని డిజిపి సూచించారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్ , వి.వి. శ్రీనివాసరావు, ఐజిపీలు ఎం. రమేష్‌, వి.సత్యనారాయణ, హైదరాబాద్‌ సిటీ జాయింట్‌ సీపీ పరిమళ హన నూతన్‌ ఇతర పోలీసు అధికారులు హాజరై డయల్‌ 100 /112సర్వీస్‌ను మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు అందించారు.

Tags:    

Similar News