పెంపుడు కుక్కల వివరాలు జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేయాలి : ఆమ్రపాలి

హైదరాబాద్ నగరంలో అన్ని పెంపుడు కుక్కల వివరాలు జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు.

By :  Vamshi
Update: 2024-08-18 03:10 GMT

హైదరాబాద్ నగరంలో అన్ని పెంపుడు కుక్కల వివరాలు జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ సౌకర్యం మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లో ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. సమయానికి శునకాలకి టీకాలు వేయించాలని మూగ జీవుల సంరక్షణ చట్టాల గురించి యాజమానుల ఫోన్ నంబర్లకు సమాచారం అందిస్తామన్నారు. దోమల నివారణ చర్యలపై షెడ్యూల్డ్‌ తయారు చేసి కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని కమిషనర్‌ తెలిపారు.

షెడ్యూల్‌ ప్రకారంగా నెలకు నాలుగు లేదా ఐదు సార్లు కాలనీకి దోమల నివారణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్‌, ఫాగింగ్‌ చర్యలు ఎప్పుడు చేస్తారు? అనేది తేదీల వారీగా కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు తెలపాలని సూచించారు. కుక్కల ఫీడింగ్‌పై ఆసక్తి గల ఎన్జీవోలు, సీఎస్‌ఆర్‌ పద్దతిలో చేపట్టేందుకు ముందుకు వచ్చిన పక్షంలో వారిలో ప్రయోగాత్మకంగా కొన్ని సర్కిల్‌లో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.

Tags:    

Similar News