బంగ్లాలో ఆందోళనల పేరుతో విధ్వంసం: షేక్‌ హసీనా

తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేసిన బంగ్లాదేవ్‌ మాజీ ప్రధాని

By :  Raju
Update: 2024-08-14 05:16 GMT

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లు, అక్కడి పరిణామాలపై మాజీ ప్రధాని షేక్‌ హసీనా మొదటిసారి స్పందించారు. తమ దేశంలో ఆందోళన పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. హత్యలు, విధ్వంసకాండలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు బంగ్లాదేశ్‌ ప్రజలను ఉద్దేశించి హసీనా చేసిన మూడు పేజీల ప్రకటనన ఆమె తనయుడు సాజిబ్‌ వాజెద్‌ జాయ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

తన పార్టీ అవామీ లీగ్‌ నేతలు, కార్యకర్తలు ఇతరులపై ఇటీవల కాలంలో జరిగిన హింసాత్మక ఘటనను ఉగ్రదాడులుగా షేక్‌ హసీనా పేర్కొన్నారు. ఈ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 15న బంగ బంధు భవన్‌ వద్ద మృతులకు నివాళులు అర్పించాలని దేశ ప్రజలు పిలుపునిచ్చారు. తన లాగే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు హసీనా పేర్కొన్నారు. తన తండ్రి షేక్‌ షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చి వేసిన ఘటనలో తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తీవ్ర రూపం దాల్చి హింసకు దారితీయడంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 

Tags:    

Similar News