జాతీయ విపత్తుగా ప్రకటించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.‘

By :  Vamshi
Update: 2024-09-02 15:45 GMT

పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.‘ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దాదాపు రూ.5,430 కోట్లు నష్టం జరిగిందని సీఎం వివరించారు.. వరద బాధితులు సర్వం కోల్పోయారు. వారికి ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నామన్నారు. ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. దెబ్బతిన్న రోడ్లు త్వరగా పునరుద్ధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

కష్టకాలంలో అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం పనితీరుతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నియంత్రించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశామని అన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. వరదలతో ఏపీలోని కృష్ణా జిల్లా కంటే ఖమ్మం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ తెలిపారు. రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News