బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో దానం నాగేందర్ బూతులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By :  Vamshi
Update: 2024-08-02 12:40 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను శాసన సభలో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఏయ్..మూస్కోవయ్యా మిమ్మల్ని హైదరాబాద్‌లో తిరగనియ్య కొడకల్లారా.. తోలు తీస్తా’ నీ అమ్మ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రామాలు ఆడుతుతున్నారా? అంటూ ఆవేశంతో వ్యాఖ్యలు చేశారు . దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు. ఇది మంచి సంప్రదాయం కాదని తక్షణమే దానం సారీ చెప్పాలని ఎమ్ఐఎమ్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నీ అమ్మ అనేది హైదరాబాద్ లోకల్ వాడుక భాష అని దాంట్లో తప్పేమీ లేదని నాగేందర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే దానం బీఆర్ఎస్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. పోడియం వైపు దూసుక రాగా.. ప్రతిగా దానం కూడా పోడియం వైపు వెళ్లారు. కాంగ్రెస్‌ సభ్యులు దానంను వెనక్కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దానం నాగేందర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్‌ పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.

Tags:    

Similar News