దళితబంధు లబ్ధిదారులు ప్రజాభవన్‌ వద్ద ఆందోళన

దళితబంధు నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు.

By :  Vamshi
Update: 2024-08-23 08:42 GMT

దళితబంధు బాధితులు పంజాగుట్ట నుంచి ప్రజాభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. దళితబంధు రెండో విడత నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు ప్రజాభవన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. దళితబంధుకు ఎంపికైనవారి ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దళితులపై సీఎం రేవంత్‌ విక్ష చూపుతున్నారని వారు మండిపడ్డారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. సుమారు 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

దళితులు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడుతలో 38,323 దళిత కుటంబాలకు రూ.10 లక్షల చొప్పున బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రూ.4,441.8 కోట్లు మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్‌ 2న రెండో విడుత కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. రెండో విడుత దళిత బంధు కోసం 2023-24 బడ్జెట్‌లో గత ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలలో.. ఒక్కో నియోవర్గంలో 1100 కుటుంబాలకు ఎంపిక చేసి మొత్తం 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అర్హులను కూడా ఎంపిక చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో లబ్ధిదారులకు నిధుల పంపిణీ నిలిచిపోయింది

Tags:    

Similar News