ఇక కరెంట్ బిల్లులు యూపీఐ ద్వారా కట్టొచ్చు

విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. ఇకపై గతంలో మాదిరిగానే కరెంట్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్​ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు.

By :  Vamshi
Update: 2024-08-17 12:56 GMT

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులను మళ్లీ పాత విధానం ద్వారా చెల్లించవచ్చని విద్యుత్ శాఖ తెలిపింది. ఫోన్ పే, యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గతంలో ఆర్బీఐ మార్గదర్శకాలతో ఇటీవల యూపీఐ యాప్​లతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మొబైల్ డిజిటల్ యాప్​లతో ఎంతో ఈజీగా పవర్ బిల్లులను చెల్లించే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యుత్తు బిల్లుల

చెల్లింపులను సులభంగా చేసేందుకు ఆంధ్రప్రదేశ్​లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(బీబీపీఎస్‌)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్‌పీసీఐకి చెందిన భారత్‌ బిల్‌ పే లిమిటెడ్‌ (బీబీఎల్‌) సీఈవో నూపూర్‌ చతుర్వేది శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మళ్లీ గూగుల్​ పే, ఫోన్​పే వంటి యూపీఐ యాప్​ల ద్వారా విద్యుత్ బిల్లులు కట్టే అవకాశం దొరికింది.రిజర్వ్‌ బ్యాంక్‌ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రజలు కరెంట్ వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న డిస్కమ్ లు యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం కల్పించింది.

Tags:    

Similar News