జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో దాడి చేసుకున్న కార్పొరేటర్లు

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం లో రసాభాస వాతావరణం నెలకొన్నది. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శించగా.. ప్లకార్డుల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్లు దాడులు చేసుకున్నారు.

By :  Raju
Update: 2024-07-06 08:49 GMT

కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్ల పరస్పర దాడులతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌పై కాంగ్రెస్‌ కార్పొరేటర్లు దాడి చేశారు. ప్లకార్డుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో మేయర్‌ నాలుగోసారి కౌన్సిల్‌ మరోసారి సమావేశాన్ని వాయిదా వేశారు.

జలమండలి పనితీరుపై బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వాటర్‌ వర్క్స్‌ ఎండీ అశోక్‌రెడ్డిని కౌన్సిల్‌కు తీసుకురావాలని కార్పొరేటర్లు పట్టుబట్టారు. వెంటనే ఆయనను పిలిపించాలని కమిషనర్‌ అమ్రపాలిని మేయర్‌ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంపీ కమిసషర్‌ అమ్రపాలి ఆయనతో ఫోన్‌లో మాట్లాడగా.. అనారోగ్యం కారణంగా తాను రావావడం లేదని తెలిపారు. 

Tags:    

Similar News