కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగులు అనే కనికరం లేదు : శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్‌ ఆదర్శనగర్‌లోని దివ్యాంగులు ఇండ్లను కూల్చివేసిన ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు.

By :  Vamshi
Update: 2024-08-30 08:55 GMT

మహబూబ్‌నగర్‌ ఆదర్శనగర్‌లోని దివ్యాంగులు ఇండ్లను కూల్చివేసిన ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకి లాగేసి ఇళ్లను కూల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటనను మీడియా సరిగ్గా చూపిస్తే దివ్యాంగుల పట్ల భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని మన దేశానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. అలాగే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు శ్రీనివాస్‌ గౌడ్‌ అల్ఫాహారం అందజేశారు. భాదితుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీమంత్రి అన్నారు.

కాగా, హైదరా బాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. వీళ్ల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ చిన్న చిన్న రేకులు, తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.

కాళ్లు లేనివారు, రెండు కళ్లులేనివారు ఫించన్‌ డబ్బులతో బతుకులు వెళ్లదీస్తున్నారు. గాలొస్తే ఎగిరిపోయే గుడిసెలను కూడా అర్ధరాత్రి వందలాది పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లను పెట్టి కూల్చేశారు అధికారులు. పాపం ఆ కళ్ళు లేని కబోదులు మీ కాళ్లు మొక్తం సారు మమ్మల్ని రోడ్డున పడేయకండి.. మా నీడను కూల్చేయకండి అంటూ విలపిస్తున్నా కనికరం లేకుండా కూల్చేశారు. హైదరాబాద్ బంజారహిల్స్‌లో కోటీశ్వరులం కాదు… వాళ్లకేమో నోటీసులు ఇస్తరు…వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటరు… మాకేందుకు ఈ అన్యాయము… ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News