డీఎస్‌ మృతిపై ప్రముఖ రాజకీయ నాయకుల సంతాపం

డీఎస్‌ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా ప్రముఖ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

By :  Raju
Update: 2024-06-29 07:38 GMT

సీనియర్‌ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు డీఎస్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.

డీఎస్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్‌ తనదైన ముద్ర వేశారు. ఆయన ఎప్పుడూ హుందా రాజకీయాలు చేసేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం డీఎస్‌ పనిచేశారని అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ డీఎస్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో డీఎస్‌ చెరగని ముద్ర వేశారని చెప్పారు.

మాజీ మంత్రి డీఎస్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. డీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్‌ భౌతికకాయాయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులు అర్పించారు. రాజకీయాల్లో డి శ్రీనివాస్ అజాత శత్రువు అని, ఆయన చనిపోవటం బాధాకరమైన విషయమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు డీఎస్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. డీఎస్‌ సుదీర్ఘకాలం సేవలు అందించారని చెప్పారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. పలువురు పార్టీ సీనియర్‌ నేతలు డీఎస్‌కు నివాళులు అర్పించారు.

డీఎస్ మృతి పట్ల పలువురు రాజకీయనాయకుల సంతాపం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వి. హనుమంతరావు, డీఎస్‌కు నివాళులు అర్పించారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి డీఎస్‌కు నివాళుల అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదొడుకు ఎదుర్కొని గొప్పగా నేతగా ఎదిగారని అన్నారు.

Tags:    

Similar News