ఫ్యూచర్‌ సిటీ’ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష

‘ఫ్యూచర్‌ సిటీ’ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు.

By :  Vamshi
Update: 2024-08-17 15:35 GMT

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో నిర్మించబోతున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి పొంగులేటి, అధికారులతో భేటీ అయ్యారు. ఎయిర్ పోర్టు నుంచి నాలుగో నగరానికి రోడ్, మెట్రో కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఫ్యూచర్ సిటీకి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ సంజయ్ కులక్షేత్ర, ఇతర ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

ఐటీ హబ్, స్పోర్ట్స్ మైదానాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పర్యాటకం, వినోదం అన్నింటికీ ఇక్కడ స్థానం ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి మైట్రో సర్వీసుల ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు.తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చిబౌలిలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ప్రతిపాదించారు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా సుమారు 12 కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News