జాతీయ రహదారుల విస్తరణ-అభివృద్ధి పనులపై నేడు సీఎం సమీక్ష

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

By :  Raju
Update: 2024-07-10 05:14 GMT

జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు జాతీయ రహదారుల విస్తరణ-అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు నిన్న ముఖ్యమంత్రిని పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని కోరారు.

ఎస్‌హెచ్ 163 మంచిర్యాల-వరంగల్‌-ఖమ్మం- విజయవాడ కారిడార్‌ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉన్నదని సీఎంకు తెలిపారు. ఎన్‌హెచ్‌ 63లో ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉన్నదన్నారు. ఎన్‌హెచ్‌ 563లో వరంగల్‌-కరీంనగర్‌ రహదారి నిర్మాణానికి చెరువుమట్టి, ఫ్లైయాష్‌ కావాలని కోరారు.

ఎన్‌హెచ్‌ 44 తో కాళ్లకల్‌- గుండ్లపోచమ్మ రహదారి ఆరు లైన్లుగా విస్తరించడానికి భూసేకరణ సీఎం రేవంత్‌కు ఎస్‌హెచ్‌ఏఐ అధికారులు వివరించారు. ఖమ్మం-దేవరపల్లి, ఖమ్మం-కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసుల భద్రత కావాలని తెలిపారు. విద్యుత్‌ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి విజ్ఞప్తులపై స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News