గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

గణేశ్ నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు

By :  Vamshi
Update: 2024-08-29 15:18 GMT

గణేశ్ నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుండి మొదలవనున్న ఉత్సవాల నిర్వహణకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. భాగ్యనగర గణేష్ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుందని, ఉత్సవాల్లో పాల్గొనే నగర పౌరులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండపాల ఏర్పాటుకు వచ్చి దరఖాస్తులను పరిశీలించి స్వయంగా విద్యుత్ అధికారులు వారికి ఉచితంగా కరెంట్ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు

గత ఏడాది హుస్సేన్ సాగర్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేయగా.. అదే విధానాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కొన్ని ప్రధాన భాగాలుగా విడదీసి, ఆయా ప్రాంతాల్లో మాత్రమే విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని తెలియ జేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి సూచించారు. సెప్టెంబర్ 17న జరిగే అన్ని కార్యక్రమాలను విజయ వంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News