విభజన సమస్యల అజెండాపై అధికారులతో సీఎం భేటీ !

విభజన సమస్యలపై ఈ నెల 6న ఏపీ, తెలంగాణ సీఎంలు సమావేశం కానున్నారు. దీన్ని దృస్టిలో పెట్టుకొనే ఇవాళ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలు చర్చించనున్నారు.

By :  Raju
Update: 2024-07-02 05:12 GMT

ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. విభజన సమస్యలు, ఏపీ సీఎంతో ఏఏ అంశాలపై చర్చించాలన్న దానిపైనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. దీన్ని దృస్టిలో పెట్టుకొనే అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించనున్నారు.

ముఖ్యంగా 9 షెడ్యూల్‌లోని వివిధ సంస్థలతో పాటు 10 షెడ్యూలోని పేర్కొన్న అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, వీటిపై షీలా బేడీ కమిటీ సిఫార్సు చేసిన 19 అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు పలుమార్లు చర్చించారు. కానీ ఆ పీటముడి వీడటకపోవడానికి కారణం ప్రధాన కారణం గత ఏపీ ప్రభుత్వాల తీరు, కేంద్ర ప్రభుత్వ అలసత్వ వైఖరి. విభజన చట్టం ప్రకారం నిధులు, ఉద్యోగులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలన్న దాని ప్రకారమే ముందుకెళ్దామన్న కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించలేదు. స్థిరాస్థుల్లో వాటా కావాలని పట్టుబట్టడంతోనే సమస్య జటిలమైంది. దీన్ని పరిష్కరించాల్సిన కేంద్ర పదేళ్లు చోద్యం చూసింది.

ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం భేటీ అవువుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేదానిపై చర్చ జరుగుతున్నది. కేంద్రంలో టీడీపీ ఇప్పుడు కీలక భాగస్వామిగా ఉన్నందున మోడీ ప్రభుత్వం వీటి పరిష్కారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలు తెలంగాణవాదుల్లో ఉన్నాయి. 

Tags:    

Similar News