మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్

జూన్‌ 26న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ను సీఎం కేజ్రీవాల్‌ సవాల్‌ చేశారు

By :  Vamshi
Update: 2024-07-01 07:53 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ..క్రేజీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల 14 రోజుల పాటు క్రేజీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కేసులో ఇప్పటికే ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తరలించింది. దీనిపై విచారణ జరుగుతుండగానే సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అప్పటి నుంచి ఎంక్వరీ కొనసాగుతోంది. ఈ మధ్యే అరవింద్ కేజ్రీవాల్‌ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని రౌజ్ అవెన్యూ కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు అంగీకరించింది. జులై 12వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అనుమతినిచ్చింది.

Tags:    

Similar News