సీఎం కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది.

By :  Vamshi
Update: 2024-08-08 10:14 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20వ తేదీ వరుకు పొడిగిస్తూ ఢిల్లి రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా అతడిని హాజరుపరచగా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈడీ వాయిదా కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేస్తే మళ్లీ అరెస్టు చేస్తారా? అని హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తెలిసిందే.

Tags:    

Similar News